
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అమరావతిలో 21.77 కిలోమీటర్ల పొడవైన సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటు రెండు స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించనున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు 14.35 కిలోమీటర్ల ఫేజ్-1, ఉండవల్లి వరకు 3.92 కిలోమీటర్ల ఫేజ్-2 పనులు పూర్తి చేశారు.
ఉండవల్లిలో బకింగ్‌హామ్ కెనాల్‌పై 110 మీటర్లు, కొండవీటి వాగుపై 280 మీటర్ల పొడవైన స్టీల్ బ్రిడ్జిలను ప్రభుత్వం నిర్మించింది.