
తెలంగాణలో డిసెంబర్‌లో జరగనున్న 8వ ఎడిషన్ 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్' నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.22 కోట్లను విడుదల చేసింది.
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ వేదికలుగా జరగనున్న ఈ క్రీడల్లో దేశవ్యాప్తంగా 6,000 మంది క్రీడాకారులు 25 క్రీడాంశాల్లో పాల్గొననున్నారు.
తెలంగాణలో ఇప్పటికే 33 ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేశామని, క్రీడాభివృద్ధికి కేంద్రం నిరంతరం సహకరిస్తోందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.