
దేశంలో జులై నెల జీఎస్టీ వసూళ్లు గతేడాది కంటే 15.4 శాతం వృద్ధితో రూ.2.11 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.
రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణలో 19 శాతం వృద్ధితో రూ.5,819 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో రూ.3,366 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.
జులైలో రూ.29,968 కోట్ల రీఫండ్లను మినహాయించగా, నికర జీఎస్టీ వసూళ్లు రూ.1.81 లక్షల కోట్లుగా నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.