
అమెరికా విధించిన టారిఫ్లకు ప్రతిస్పందనగా, సెప్టెంబర్ 8 నుంచి 20 బిలియన్ డాలర్ల విలువైన 700 అమెరికా వస్తువులపై 15 నుండి 50 శాతం వరకు సుంకాలు విధిస్తున్నట్లు కెనడా ప్రకటించింది.
స్టీల్, డెయిరీ, ఎలక్ట్రానిక్స్ రంగాలపై ఈ సుంకాల ప్రభావం ఉండనుండగా, అమెరికా ప్రతిపాదించిన కొత్త వాణిజ్య నిబంధనలు అన్యాయంగా ఉన్నాయని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆరోపించారు.
కెనడా ఆటోమొబైల్ పరిశ్రమపై వచ్చే ఏడాది మరిన్ని టారిఫ్లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి.