
నీట్ పేపర్ లీకేజీల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల విద్యావ్యవస్థకు ఎదురవుతున్న ముప్పే అత్యంత ప్రమాదకరమైనదని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆందోళన వ్యక్తం చేశారు.
ఏఐ సాంకేతికత మానవ మెదడు కంటే వేగంగా సమాధానాలు ఇస్తోందని, కష్టపడి చదువుకుని సుఖపడవచ్చు అనే పాత నమ్మకాన్ని ఇది దెబ్బతీసిందని ఆర్జీవీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఏఐ వాడకం నేర్పని చదువు వ్యర్థమని, భవిష్యత్తులో ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు కనుమరుగై ఇంజనీరింగ్, మెడిసిన్, లా డిగ్రీలు కేవలం కాగితాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.