
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నహాస్ హిదయత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఐ యామ్ గేమ్' చిత్రాన్ని వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించింది.
తన నిర్మాణ సంస్థలో వచ్చిన అతి పెద్ద సినిమా ఇదని, తెలుగులో తీసిన భారీ చిత్రాల స్థాయిలో ఉంటుందని దుల్కర్ పేర్కొన్నారు.
ఈ సినిమాలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అంశాలు చాలా ఉన్నాయని దుల్కర్ సల్మాన్ వెల్లడించారు.