
అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.
జస్టిస్ చల్లా గుణరంజన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించడంతో రోడ్డు నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి.
పెనుమాక, ఉండవల్లి గ్రామాలకు చెందిన వారు భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ గతంలో కోర్టును ఆశ్రయించారు.