ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 రెండో త్రైమాసికంలో రూ.7,823 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 6 శాతం వృద్ధిని నమోదు చేసింది.
కంపెనీ క్యూ2 ఆదాయం ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన 11 శాతం పెరిగి రూ.49,244 కోట్లకు చేరింది. మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో వార్షిక రెవెన్యూ గైడెన్స్‌ను 1-2 శాతానికి తగ్గించింది.
షేర్ హోల్డర్లకు ఒక్కో షేరుకు రూ.26 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించగా, నవంబర్ 3, 2026 నాటికి అర్హులైన వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది.