
చంద్రుడిపై శాశ్వత స్థావరాలు ఏర్పాటు చేసేందుకు సౌరశక్తి సరిపోకపోవడంతో అమెరికా, చైనా, రష్యా దేశాలు అణు రియాక్టర్ల ఏర్పాటుకు పోటీపడుతున్నాయి.
నాసా ప్రతిపాదించిన లూనార్ రియాక్టర్-1 సుమారు 20 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా 2030 డిసెంబర్ నాటికి ప్రయోగానికి సిద్ధం చేస్తోంది.
రష్యా కూడా చైనాతో కలిసి సెలీనా పేరుతో అణు రియాక్టర్‌ను అభివృద్ధి చేసి 2036 నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.