
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు సంస్థకు చెందిన 6,330 ఎకరాల భూమిని బహిరంగ వేలం వేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.
సెప్టెంబర్ 15 నాటికి వేలం ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపిన మంత్రి, బాధితులకు పారదర్శకంగా సమాచారం అందించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్, డ్యాష్‌బోర్డును రూపొందిస్తున్నామని వెల్లడించారు.
అగ్రిగోల్డ్ సంస్థ దేశవ్యాప్తంగా 23,430 ఎకరాల ఆస్తులను కలిగి ఉండగా, ఏపీలో 20,450 ఎకరాలను గుర్తించామని, ఏజెంట్ల వద్ద ఉన్న రూ.2 వేల కోట్ల బాండ్లను సేకరించేందుకు ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.