షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో జరుగుతున్న 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షోలో ప్రదర్శిస్తున్న భారీ బంగారు కడ్డీకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది.
బులియన్ ట్రేడింగ్ కంపెనీ ప్రదర్శిస్తున్న ఈ కడ్డీ ఎత్తు 2.12 మీటర్లు కాగా, బరువు సుమారు 30 కిలోలు మరియు దీని విలువ రూ.39 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
ఈ కడ్డీని నిలువుగా గోల్డెన్ రూలర్ తరహాలో ఏర్పాటు చేయడంతో సందర్శకులు దాని పక్కన నిలబడి తమ ఎత్తును చూసుకునే అవకాశం కల్పించారు.