
బిహార్‌లోని పూర్ణియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్‌పై ఢిల్లీలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహిస్తుండగా ఆదివారం హత్యాయత్నం జరిగింది.
దాడికి యత్నించిన వ్యక్తిని సుమిత్ (34)గా గుర్తించగా, అతడితో పాటు కారులో ఉన్న హ్యాపీ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తనకు భద్రత కల్పించాలని కోరినా పోలీసులు స్పందించలేదని ఎంపీ ఆరోపించగా, నిందితుడు ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందినవాడని పోలీసులు వెల్లడించారు.