
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీ హైకోర్టు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సహా పలు కీలక ప్రాంతాలకు ఖలిస్తాన్ పేరుతో బాంబు బెదిరింపు ఈమెయిల్లు వచ్చాయి.
ఢిల్లీని ఖలిస్తాన్గా మారుస్తామని పేర్కొంటూ శనివారం మధ్యాహ్నం 2:11 గంటలకు పేలుళ్లు జరుగుతాయని హెచ్చరించిన ఈమెయిల్లో జామ్నగర్ హౌస్, సాకేత్ కార్యాలయం వంటి ఆరు ప్రాంతాల పేర్లు ఉన్నాయి.
అప్రమత్తమైన అధికారులు భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలు చేపట్టగా, ఇప్పటివరకు ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు వెల్లడించారు.