
అదుపులేని కృత్రిమ మేధ (ఏఐ) దుష్ట ఆలోచనలు ఉన్న వ్యక్తుల చేతుల్లో ఉంటే ఏకంగా 100 కోట్ల మంది మరణించే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ హెచ్చరించారు.
ఏఐ అవధుల్లేనంత శక్తిమంతం కాకుండా దానిపై ప్రభుత్వాలు కఠినమైన నియంత్రణలు విధించాలని ఆయన కోరారు.
రానున్న ఐదేళ్లలో సూపర్ ఇంటలిజెన్స్ ఏఐ యంత్రాలు ఉనికిలోకి వస్తాయని అలన్ ట్యూరింగ్ ఇన్స్టిట్యూట్ తన నివేదికలో పేర్కొంది.