
సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్‌ను ఉద్దేశించి ఎక్స్‌లో అభ్యంతరకర పోస్ట్ పెట్టిన గుర్తుతెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఐటీ చట్టం మరియు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు, నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది.