
నల్గొండ పట్టణ అభివృద్ధి పేరుతో ఫుట్‌పాత్ వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీయవద్దని సీపీఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ రోడ్డు, స్టేడియం ప్రాంతాల్లో వందలాది కుటుంబాలు ఫుట్‌పాత్ వ్యాపారాలపైనే ఆధారపడి జీవిస్తున్నాయని వారు గుర్తుచేశారు.
అధికారులు ముందస్తు సమాచారం లేకుండా వ్యాపారుల సరుకులను తొలగించకుండా, వారికి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని కోరారు.