టాటా గ్రూప్‌కు చెందిన రిటైల్ దిగ్గజం ట్రెంట్ లిమిటెడ్ షేరు ధర రెండో త్రైమాసిక బిజినెస్ అప్డేట్ కారణంగా ఇంట్రాడేలో ఏకంగా 13 శాతం దూసుకెళ్లి రూ. 2,909 గరిష్ఠాన్ని తాకింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో స్టాండలోన్ ప్రాతిపదికన కంపెనీ కార్యకలాపాల ఆదాయం 23 శాతం పెరిగి రూ. 5,788 కోట్లకు చేరనుందని అంచనా వేసింది.
ఇదే త్రైమాసికంలో కంపెనీ తన 1,000వ జుడియో స్టోర్‌ను ప్రారంభించగా, మొత్తం స్టోర్ల సంఖ్య 1,342కి చేరింది.