
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో జలుబు, దగ్గుతో ఆర్ఎంపీ వద్దకు వెళ్లిన హేమశ్రీ (14) అనే బాలిక ఇంజక్షన్ ఇచ్చిన వెంటనే మృతి చెందింది.
బాలిక మృతికి కారణమైన ఆర్ఎంపీ వైద్యుడు ఆసుపత్రికి చేరుకోగానే పరారయ్యాడని, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని ఎస్సై సూరజ్ తెలిపారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు పేర్కొన్నారు.