
రాయ్‌పూర్ వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ప్రవర్తనా నియమావళిని (కోడ్ ఆఫ్ కాండక్ట్) ఉల్లంఘించిన భారత మహిళల జట్టు ఓపెనర్ షఫాలీ వర్మకు ఐసీసీ ఒక డిమెరిట్ పాయింట్‌తో పాటు అధికారిక మందలింపు జారీ చేసింది.
మ్యాచ్‌లో చిపో ముగెరి-తిరిపానో ఇచ్చిన క్యాచ్‌ను డ్రాప్ చేసిన తర్వాత షఫాలీ కోపంతో బంతిని నేలకేసి విసిరికొట్టడం ఐసీసీ ఆర్టికల్ 2.2 నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని మ్యాచ్ రిఫరీ జీఎస్ లక్ష్మి ఈ చర్య తీసుకున్నారు.
అదే మ్యాచ్‌లో కేవలం 25 బంతుల్లో 55 పరుగులు చేసిన షఫాలీ, ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధికంగా 9 సార్లు 50 పైచిలుకు స్కోర్లు సాధించిన బ్యాటర్‌గా స్మృతి మంధాన (8) రికార్డును అధిగమించి ప్రపంచ రికార్డు సృష్టించింది.