
హైదరాబాద్‌లోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు పంట ఆకులను స్కాన్ చేసి తెగుళ్లను 97.7% కచ్చితత్వంతో గుర్తించే ఏఐ వ్యవస్థను రూపొందించారు.
టొమాటో, బంగాళాదుంప, క్యాప్సికమ్ పంటలకు చెందిన 20 వేల చిత్రాలను విశ్లేషించి, తెగులు నివారణకు అవసరమైన మందులను కూడా ఈ వ్యవస్థ సూచిస్తుంది.
ప్రస్తుతం వెబ్ ఇంటర్‌ఫేస్‌లో అందుబాటులో ఉన్న ఈ సాంకేతికతను మొబైల్ అప్లికేషన్‌గా మార్చేందుకు పరిశోధకులు కృషి చేస్తున్నారు.