
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లు అలాగే జెడ్పీ చైర్మన్, ఎంపీపీ పదవులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని ఆదేశించింది.
డెడికేషన్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా నిబంధనలను అనుసరించి ఈ రిజర్వేషన్లను నిర్ణయించాలని స్పష్టం చేసింది.