
తమిళనాడులోని కులశేఖరపట్నంలో రూ. 950 కోట్ల వ్యయంతో ఇస్రో నిర్మిస్తున్న స్మాల్ శాటిలైట్ లాంచ్ కాంప్లెక్స్ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నారు.
ఈ ప్రాజెక్టులో పాల్గొనే సంస్థలకు కనీసం రూ. 3,500 కోట్ల మౌలిక వసతుల అనుభవం, రూ. 2,000 కోట్ల వార్షిక టర్నోవర్ ఉండాలని ఇన్-స్పేస్ నిబంధనలు విధించింది.
శ్రీహరికోటతో పోలిస్తే ఇక్కడి నుంచి రాకెట్లను నేరుగా దక్షిణ ధ్రువం వైపు ప్రయోగించడం వల్ల ఇంధనం ఆదా అవ్వడంతో పాటు పేలోడ్ సామర్థ్యం పెరుగుతుంది.