
సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ 'మహేంద్రగిరి వారాహి' సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీ, తమిళ భాషల్లో కూడా విడుదలవుతోందని నిర్మాతలు తెలిపారు.
ఈ సినిమాలో మూఢ నమ్మకాలను ఎక్స్పోజ్ చేసే పాత్రలో సుమంత్ కనిపిస్తుండగా, సిద్దు జొన్నలగడ్డ కీలక పాత్ర పోషించారు.