
మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ నివేదికను ఏఐసీసీకి పంపినట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అంశంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకోనుంది.
పార్టీ అధిష్ఠానం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.