
కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్‌లో పాఠశాలల్లో మతపరమైన గుర్తులు, వస్త్రధారణపై ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ప్రాథమిక పాఠశాల విద్యార్థులు టర్బన్లు, నిఖాబ్‌లు ధరించడాన్ని నిషేధించాలని నిర్ణయించడంతో సిక్కు, ముస్లిం వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
చిన్నారులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా వారిలో వివక్ష పెంచుతున్నారని కెనడియన్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ విమర్శించింది.