రావల్పిండిలోని ఆడియాలా జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ జర్నలిస్ట్ వజహత్ సయీద్ ఖాన్ చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపింది.
అయితే ఈ సమాచారం నిఘావర్గాలు ధ్రువీకరించనిదని, కేవలం సైనిక అధికారుల వ్యక్తిగత అంచనా మాత్రమేనని పేర్కొంటూ సదరు జర్నలిస్ట్ తన వాదనను వెనక్కి తీసుకున్నారు.
ఇమ్రాన్ ఖాన్ భద్రతపై ఆందోళనల నేపథ్యంలో, ఆయనను కలవడానికి అనుమతించకుంటే సెప్టెంబరు 27న 20 లక్షల మందితో ఇస్లామాబాద్ వైపు లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని పీటీఐ నేత సోహైల్ ఆఫ్రిది హెచ్చరించారు.