
మహేష్ బాబుతో తెరకెక్కుతున్న వారణాసి చిత్రంలో రామాయణం నుంచి కీలక ఘట్టాన్ని చిత్రీకరించినట్లు రాజమౌళి వెల్లడించారు.
ఇతిహాసాలను ఇప్పటివరకు చూపించిన విధానంపై తనకు అసంతృప్తి ఉండేదని, ఈ చిత్రంలో ఎమోషన్స్‌ను అద్భుతంగా చూపించనున్నట్లు తెలిపారు.
దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.