
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్థాన్, శ్రీలంక జట్లకు ఐసీసీ జరిమానా విధించింది.
పాక్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం, లంక ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
పాకిస్థాన్ నిర్ణీత సమయానికి రెండు ఓవర్లు తక్కువ వేయగా, శ్రీలంక ఒక ఓవర్ వెనుకబడింది.