
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో మ్యాన్‌హోల్స్ మూతల చోరీని అరికట్టేందుకు ముఖ్యమంత్రి మరియం నవాజ్ ‘గట్టర్ చట్టాన్ని’ ప్రవేశపెట్టారు.
ఈ నేరానికి పాల్పడి ఎవరైనా మరణానికి కారణమైతే నిందితులకు పదేళ్ల జైలు శిక్ష మరియు రూ. 50 లక్షల జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
చోరీలను నివేదించడానికి అధికారులు ‘ఢక్కన్ యాప్’ను అందుబాటులోకి తెచ్చారు, దీని ద్వారా స్థానికులు మూతలు లేని మ్యాన్‌హోల్స్ ఫొటోలను పంపవచ్చు.