Indian Politics
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అరెస్టు

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అరెస్టు

Andhrajyothy4h
THE BRIEF
1

బోడుప్పల్ రియల్టర్ హరికృష్ణపై హత్యాయత్నం చేసిన కేసులో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌తో పాటు ముగ్గురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.

2

గతనెల 30న ఆర్థిక లావాదేవీల విషయంలో హరికృష్ణపై ఇనుప రాడ్డుతో దాడి చేసిన సుమంత్, తన అనుచరులతో కలిసి ప్రకాశం జిల్లా మార్టూరులో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

3

ఈ నెల 20న బాధితుడు ఫిర్యాదు చేయడంతో మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.