
ఫొటోలో జీపీఎస్ సమాచారం లేకపోయినా, ఏఐ సాయంతో అది ఎక్కడ తీసిందో 91 శాతం కచ్చితత్వంతో గుర్తించవచ్చని మెకాఫీ అధ్యయనం వెల్లడించింది.
గూగుల్ గెమ్మా 3, అలీబాబా క్వెన్ 3 వంటి ఏఐ మోడల్స్ భవనాలు, రోడ్డు గుర్తులు, వెలుతురు ఆధారంగా లొకేషన్‌ను అంచనా వేస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ సాంకేతికత సైబర్ నేరగాళ్లకు ఉపయోగపడే ప్రమాదం ఉందని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోల ద్వారా వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లవచ్చని హెచ్చరించారు.