
గ్లోబల్ డిజిటల్ పేమెంట్స్ సంస్థ వీసా తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో సుమారు 7 శాతం అంటే 2,600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
సంస్థను పునర్వ్యవస్థీకరించడం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను వ్యాపారంలోకి తీసుకురావడం మరియు ఖర్చులను నియంత్రించడం ఈ లేఆఫ్స్‌కు ప్రధాన కారణమని సీఈఓ ర్యాన్ మెక్‌ఇనెర్నీ తెలిపారు.
ప్రస్తుతం వీసాలో 34,100 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ఈ తొలగింపులు ప్రధానంగా టెక్నాలజీ మరియు ప్రొడక్ట్ విభాగాలపై ప్రభావం చూపనున్నాయి.