పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు విటమిన్ డి, క్యాల్షియం, జింక్, మెగ్నీషియం మరియు ఒమేగా 3 లోపం లేకుండా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి కిలో బరువుకు 1.5 గ్రాముల ప్రొటీన్ అందించాలని, భోజనంతో పాటు పండ్లు, నట్స్, పాల ఉత్పత్తులను స్నాక్స్‌గా ఇవ్వాలని మేయో క్లినిక్ పేర్కొంది.
కొత్త ఆహార పదార్థాలను అలవాటు చేయడానికి 15 రోజుల సమయం పడుతుందని, తినేటప్పుడు టీవీ, ఫోన్లకు దూరంగా ఉంచి ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని నిపుణులు చెబుతున్నారు.