
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను 40 ఎకరాల బంజరు భూమిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించడంలో అప్పటి కార్యదర్శి జై షా కీలక పాత్ర పోషించారని దేవజిత్ సైకియా తెలిపారు.
ఈ ప్రాజెక్టు కోసం 2022 ఫిబ్రవరి 14న పనులు ప్రారంభించగా, నవంబర్ 2024లో ఈ సెంటర్ కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభమయ్యాయని బోర్డు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి వంటి అగ్రశ్రేణి క్రికెటర్లు ఈ సెంటర్‌లో చికిత్స మరియు శిక్షణ పొందుతున్నారని బోర్డు పేర్కొంది.