
ఆగస్టు నెల ప్రారంభం నుంచి ఇప్పటివరకు వెండి ధరలు ఏకంగా 20 శాతానికి పైగా పెరిగి, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో కిలో వెండి ధర రూ. 2,44,000 దాకా చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (సుమారు 31.1 గ్రాములు) వెండి ధర 69.71 డాలర్ల మార్కును తాకింది, గత జూన్ తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.
అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలు, డాలర్ విలువ క్షీణించడం, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు, పారిశ్రామిక డిమాండ్ పెరుగుదల వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు.