
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుమల విద్యాసంస్థల నిర్వాహకుడు నున్నా సురేశ్ మరణించారు.
చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సురేశ్ కారు, అక్కడ ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ప్రమాద స్థలంలోనే సురేశ్ ప్రాణాలు కోల్పోవడంతో విద్యాసంస్థల వర్గాల్లో విషాదం నెలకొంది.