
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ మరియు ఇతర రిక్రూటింగ్ ఏజెన్సీలు చేసే ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పెంపు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని, నాన్-యూనిఫామ్ సర్వీసులకు 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు మరియు మిగిలిన నియామకాలకు 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు వయోపరిమితి పెంచినట్లు తెలిపారు.
యూనిఫాం సర్వీసులకు సాధారణ కేటగిరీలో రెండేళ్లపాటు వయోపరిమితిని పెంచగా, రిజర్వుడ్ కేటగిరీలకు సంబంధించిన సడలింపులు యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించారు.