
సెప్టెంబర్ 2026లో టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటించి 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ తెలిపారు.
ఈ పర్యటన ఖరారైతే వన్డే ఫార్మాట్‌కు పరిమితమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు 2027 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా కీలక ప్రాక్టీస్ లభించనుంది.
భద్రతా పరంగా బంగ్లాదేశ్ ఎంతో సురక్షితమని, బీసీసీఐతో చర్చలు జరుపుతున్నామని, తుది నిర్ణయం బీసీసీఐ చేతిలోనే ఉందని తమీమ్ ఇక్బాల్ స్పష్టం చేశారు.