
హైదరాబాద్‌లోని ఫతేనగర్‌లో గంజాయి సేవిస్తూ పట్టుబడిన 70 మందిలో 65 మందికి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది.
వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నారని, అందరి రక్త నమూనాల్లో టీహెచ్‌సీ పదార్థం ఉన్నట్లు ఈగల్ ఫోర్స్ వెల్లడించింది.
గంజాయి విక్రయించిన 75 ఏళ్ల వృద్ధురాలిని అరెస్టు చేసి, పాజిటివ్ వచ్చిన వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు.