
యెమెన్‌లో భారతీయులను తరలిస్తున్న నౌకపై సౌదీ అరేబియా దాడి చేసిందని గురువారం హూతీలు ఆరోపించారు.
జుకర్ ద్వీపం వద్ద జరిగిన ఈ ఘటనలో నౌకలోని 14 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నట్లు యెమెన్‌లోని భారత దౌత్య కార్యాలయం స్పష్టం చేసింది.
బాధిత భారతీయులకు సంబంధించిన మరింత సమాచారం సేకరించేందుకు దౌత్య కార్యాలయం ప్రయత్నిస్తుండగా, వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు.