
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్గో మిషన్ విజయవంతమైంది.
స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పంపిన మానవ రహిత 'డ్రాగన్' కార్గో నౌకలో వ్యోమగాముల కోసం 2,800 కేజీలకు పైగా ఆహారం, సామాగ్రి, శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి.
ఈ నౌక అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల పరిశోధన కోసం మానవ మెదడు కణజాల నమూనాలను కూడా ISSకు చేరవేసింది.