ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు రమేష్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు.
పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘గబ్బర్ సింగ్’తో పాటు పలు తెలుగు సినిమాల్లో నటించి రమేష్ ప్రేక్షకులను అలరించారు.
రమేష్ అనారోగ్య పరిస్థితి మరియు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న వెంటనే చిరంజీవి స్పందించి ఈ సాయం అందజేశారు.