
హర్యానాలోని కురుక్షేత్రలో ఒక న్యాయవాది ఇంట్లోకి చొరబడిన దొంగలు రూ. 3.15 కోట్ల విలువైన నగలను దోచుకెళ్లారు.
గతంలో కూడా ఇదే న్యాయవాది ఇంట్లో దొంగతనం చేసిన ముఠా, మళ్లీ అదే ఇంటిని లక్ష్యంగా చేసుకుని ఈ భారీ దోపిడీకి పాల్పడింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతుండగా, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.