
బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైనిక బలగాలపై తాము భారీ దాడికి పాల్పడినట్లు బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ ప్రకటించింది.
గ్వాదర్ జిల్లాలో అక్టోబర్ 22న ప్రారంభమైన ఆపరేషన్ అల్మాస్‌లో భాగంగా 80 మందికి పైగా పాకిస్థాన్ సైనికులు, నిఘా అధికారులను హతమార్చినట్లు వెల్లడించింది.
ఈ దాడుల్లో మరణించిన వారి సంఖ్యపై పాకిస్థాన్ ప్రభుత్వం లేదా స్వతంత్ర వర్గాల నుండి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ వెలువడలేదు.