
చేతులు దాటిపోతున్న కృత్రిమ మేధ (ఏఐ) భూతానికి పగ్గాలేయకుంటే మానవాళికే తీవ్ర ముప్పు వాటిల్లుతుందని అంతర్జాతీయ ఏఐ కంపెనీలు ఐక్యరాజ్యసమితిని కోరాయి.
ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా ఆంత్రోపిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డారియో అమొడె, ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ రిమోట్ పద్ధతిలో ఈ హెచ్చరికలు చేశారు.
ఏఐ టెక్నాలజీ భవిష్యత్తులో జీవశాస్త్ర ఆయుధాల తయారీకి వాడకుండా ప్రమాణాలను రూపొందించాలని వక్తలు పిలుపునిచ్చారు.