
బజాజ్ ఫైనాన్స్ పేరుతో నకిలీ కాల్ సెంటర్లు నిర్వహిస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఢిల్లీలో ఛేదించారు.
ఢిల్లీలోని శివ మార్కెట్‌లో నిర్వహిస్తున్న మూడు కాల్ సెంటర్లపై దాడులు చేసి, తెలంగాణకు చెందిన 21 మంది మహిళా టెలికాలర్లను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ రాకెట్ ప్రధాన నిర్వాహకులు లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని అధికారులు వెల్లడించారు.