
2006 ఆగస్టు 23న ఏర్పాటైన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రజా భద్రతలో కీలక పాత్ర పోషిస్తూ 20 వసంతాలు పూర్తి చేసుకుంది.
పోలీసు వ్యవస్థ ప్రజలకు మరింత చేరువ కావాలంటే ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం అవసరమని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
సైబరాబాద్ కమిషనర్గా పనిచేసిన సమయంలో కౌన్సిల్ను బలోపేతం చేశామని, ప్రజా భద్రత కోసం అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టామని ఆయన గుర్తు చేశారు.