
జూనియర్ స్థాయిలో ఆడే సమయంలో పుట్టిన తేదీని మార్చారనే ఆరోపణలపై బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్పై నౌబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
భారత న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 175 (3) కింద చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు కాగా, సెప్టెంబరు 3లోగా ప్రాథమిక విచారణ నివేదిక ఇవ్వాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.
దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరఫున 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 9,714 పరుగులు చేసిన 45 ఏళ్ల మన్హాస్పై జేకేసీఏ మాజీ అధికారి సుదర్శన్ మెహతా కోర్టును ఆశ్రయించారు.