
మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన తన భర్త జోగి రాజీవ్ మరియు అత్తమామలపై గృహహింస, హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
2025 మే 28న సూర్యాపేటలో వివాహం జరిగినప్పటి నుండి తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని మేఘన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తనను చంపేందుకు పలుమార్లు ప్రయత్నించారని ఆరోపిస్తూ, అత్తమామలు తన భర్తకు వత్తాసు పలుకుతున్నారని ఆమె పోలీసులకు వివరించారు.