
అమెరికాలో మధ్యంతర ఎన్నికల వేళ ఇరాన్ శక్తివంతమైన సైనిక దళం ఐఆర్‌జీసీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ 25 పేజీల బహిరంగ లేఖను విడుదల చేసింది.
ట్రంప్ పాలనను తప్పుపట్టిన ఐఆర్‌జీసీ.. ప్రస్తుత సంఘర్షణకు తెరపడాలంటే వాషింగ్టన్ తన ఓటమిని అంగీకరించి సైనిక బలగాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరుగుతుండటంతో రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకత పెరుగుతోందని, ఎన్నికల ఉచ్చు నుంచి బయటపడేందుకు ట్రంప్ ఓటర్లకు ఐదు వేల డాలర్లు ఇస్తానంటున్నారని విశ్లేషకులు తెలిపారు.